Tue Dec 24 2024 01:44:54 GMT+0000 (Coordinated Universal Time)
మరో ఎన్ కౌంటర్.. నలుగురు మావోల మృతి
ములుగు - ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ములుగు - ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అవుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఎదురు కాల్పుల్లో....
అయితే మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మరణించిన నలుగురు మావోయిస్టులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కాల్పుల తర్వాత కూడా అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
- Tags
- en counter
- moists
Next Story