Tue Dec 24 2024 00:36:29 GMT+0000 (Coordinated Universal Time)
ఐసీయూలో రోగి వేళ్లను కొరికి తినేసిన ఎలుకలు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో ఉన్న రోగి వేళ్లను ఎలుకలు కొరికేశాయి.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో ఉన్న రోగి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. వివరాల్లోకి వెళితే శ్రీనివాస్ అనే యువకుడు అనారోగ్య సమస్యతో ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. శ్రీనివాస్ ను ఐసీయూలో ఉండి చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ చేతివేళ్లను, కాలివేళ్లను ఎలుకలు కొరుక్కుతినేశాయి. ఇది గమనించిన బంధువులు ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశాయి.
పైలు లైన్ల ద్వారా.....
ఏసీ పైపులైన్ల ద్వారా ఎలుకలు ఐసీయూలోకి వచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరని స్థానికులు చెబుతున్నారు. పైపులైన్ల ద్వారా ఎలుకలు వస్తున్నాయని తెలిసి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై రోగి శ్రీనివాస్ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.
Next Story