Thu Apr 03 2025 07:08:44 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ, తెలంగాణలలో సెలవులు రద్దు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈ రెండు రోజులు అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈ రెండు రోజులు అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఏపీ, తెలంగాణలోని రిజిస్ట్రేషన్ శాఖలు ఈరోజు, ుేపు తెరుచుకునే ఉంటాయి. ఈ రెండు రోజులు సెలవు దినాల్లో కూడా పనిచేయాలని ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో నేడు, రేపు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తాయని తెలిపారు.
వరస సెలవులు రావడంతో్...
వరస సెలవులు రావడంతో తమకు రిజిస్ట్రేషన్ చేయడం ఇబ్బందికరంగా మారిందని ప్రజలు కోరడంతో ఈ చర్యలు ప్రభుత్వాన్ని తీసుకున్నాయి. ఈరోజు ఆదివారం, ఉగాది, రేపు రంజాన్ కావడంతో అన్నిప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. తెలంగాణలో ఎల్.ఆర్.ఎస్ కు గడువు ఈ నెల 31వ తేదీన ముగియనుండటంతో పాటు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెరగనుందని తెలియడంతో పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయని తెలిసింది. వీటితో పాటు రెండు రాష్ట్రాల్లోని ఆస్తిపన్నుచెల్లించే వారికి కూడా ఈ వెసులుబాటుకల్పించింది. ఈరెండు రోజుల పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను వసూళ్ల కేంద్రాలు పనిచేయనున్నాయి.
Next Story