Mon Dec 15 2025 00:22:14 GMT+0000 (Coordinated Universal Time)
జిందాల్ తో నేడు చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ప్రముఖ పారిశ్రామిక వేత్త పృథ్వీరాజ్ జిందాల్ తో సమావేశం కానున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ప్రముఖ పారిశ్రామిక వేత్త పృథ్వీరాజ్ జిందాల్ తో సమావేశం కానున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు వీరిసమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను జిందాల్ సంస్థ నడుపుతుంది. మరో రెండు ప్లాంట్లను త్వరలో ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు...
వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్రలోనూ ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా అన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పాటు అనేక అంశాలపై పృథ్వీరాజ్ జిందాల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించి పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.
Next Story

