Mon Dec 23 2024 23:29:12 GMT+0000 (Coordinated Universal Time)
ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ ట్రస్ట్‌కు చంద్రబాబు
ఈనెల ఏడో తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు
ఈనెల ఏడో తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ట్రస్ట్ భవన్‌కు చంద్రబాబు రానున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశంకానున్నారు. టీడీపీ నూతన అధ్యక్షుడు నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలు పై తెలంగాణ నేతలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి హోదా లో చంద్రబాబు నాయుడు రాక తో టీటీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
నేతలతో సమావేశమై...
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడంతో తిరిగి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సమర్థుడైన నేతను అధ్యక్షుడిగా నియమించి తిరిగి తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేయనున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రానున్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న కాలంలో వరస సమావేశాలు పెడతానని, నేతలను తిరిగి క్షేత్రస్థాయి పర్యటనలకు పంపేందుకు సిద్ధమయ్యారు.
Next Story