Mon Dec 23 2024 09:18:04 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగణ ప్రభుత్వోద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 122 మంది తెలగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీవ్ చేస్తూ ఉతర్వలు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వోద్యోగులను రిలీవ్ చేస్తూ జీవో విడుదల చేసింది.
ఇటీవల సమావేశంలో...
గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్న డిమాండ్ ఇది. పదేళ్లుగా తెలంగాణకు చెందిన ఉద్యోగులు తమ సొంత రాష్ట్రానికి పంపాలంటూ వినతిపత్రాలను అందచేస్తూనే ఉంది. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ ఉద్యోగుల సమస్య కూడా ప్రస్తావన వచ్చింది. దీంతో దానికి చెక్ పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story