Sat Nov 23 2024 02:17:19 GMT+0000 (Coordinated Universal Time)
సింగరేణిలో మరో ప్రమాదం.. 24 గంటల్లో 5గురు మృతి
24 గంటలు గడవకముందే.. సింగరేణిలో మరో ప్రమాదం జరిగింది. రామగుండం పరిధిలోని సింగరేణి ఆర్జీ3 లోని ఓసీపీ -1లో గురువారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది.
సింగరేణిలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బుధవారం జరిగిన ప్రమాదంలో అక్కడకక్కడే మరణించగా.. మరో ఇద్దరు కార్మికులు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం జరిగి 24 గంటలు గడవకముందే.. సింగరేణిలో మరో ప్రమాదం జరిగింది. రామగుండం పరిధిలోని సింగరేణి ఆర్జీ3 లోని ఓసీపీ -1లో గురువారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. డంపర్ ను మరో డంపర్ ఢీ కొట్టిన ఈ ప్రమాదంలో ఆపరేటర్ శ్రీనివాస్ మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సింగరేణి అధికారులు.. ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు శ్రీనివాస్ గా గుర్తించారు. శ్రీనివాస్ ఆకస్మిక మరణంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదిలా ఉండగా.. శ్రీరాంపూర్ బొగ్గు గని-3లో ప్రమాదం జరిగి 24 గంటలు గడవక ముందే మరో ప్రమాదం జరగడంతో కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, నరసింహరాజు, చంద్రశేఖర్ అనే కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్ లోనూ సింగరేణిలో ప్రమాదం జరిగింది. కాకతీయ భూగర్భగనిలో పైకప్పు కూలడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. కాగా, పై కప్పు గురించి అధికారులకు సమాచారం అందించినా సరైన చర్యలు తీసుకోవడం లేదని.. పై కప్పు వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
Next Story