Mon Dec 23 2024 09:41:37 GMT+0000 (Coordinated Universal Time)
రాజీనామా ఆమోదం పొందుతుందా?
తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుంది. మునుగోడులో ఉప ఎన్నికకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధమవుతున్నారు
తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుంది. మునుగోడులో ఉప ఎన్నికకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతలు పార్టీలోనే ఉంచాలని ఎంతగా ప్రయత్నించినా బీజేపీలో చేరేందుకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన అనంతరం ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయం. ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్ లో ఉన్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికకు ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నారని తెలిసింది.
స్పీకర్ ఆమోదిస్తేనే....
ఆగస్టు నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే దానిని స్పీకర్ ఆమోదించాల్సి ఉంది. అయితే స్పీకర్ ఆమోదిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో మరో ఉప ఎన్నికకు అధికార పార్టీ కూడా సిద్దమయ్యే అవకాశాలు కన్పించడం లేదు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ స్పీకర్ ఆమోదించకుండా కొంతకాలం తొక్కిపెడితే ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. రాజీనామా ఆమోదం పొందితేనే ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తం మీద అధికార పార్టీ టీఆర్ఎస్, ఇటు బీజేపీలు మునుగోడు ఉప ఎన్నికపై గేమ్ స్టార్ట్ చేసినట్లే కనపడుతుంది.
Next Story