Sat Dec 21 2024 05:27:02 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఏసీబీ విచారణ నేడు ప్రారంభమవుతుందా? నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మరో కేసు నమోదు అయింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మరో కేసు నమోదు అయింది. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఫెమా ఉల్లంఘన, మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఆధారంగా చేసుకుని ఈ కేసును నమోదు చేశారు. ఇందులోనూ కేటీఆర్ ను ఏ1 నిందితుడిగా పేర్కొన్నారు. ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి పేర్లను పెట్టారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈ కేసు నమోదు చేశారు.
వివిధ కేసుల కింద...
నిధులు విదేశీ సంస్థలకు మళ్లించడంతో ఫెమా ఉల్లంఘన, మనీలాండరింగ్ చట్టం కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులందరికీ త్వరలోనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడంతో హైకోర్టు కూడా విచారణ చేయవచ్చని తెలిపింది. దీతో ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి ఏ క్షణంలోనైనా కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశముంది. కాకుంటే పది రోజుల పాటు అరెస్ట్ చేయవద్దంటూ నిన్న హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరో ఈడీ కేసు మెడకు చుట్టుకుంది.
ఈ కోణంలో దర్యాప్తు...
ప్రభుత్వ నిధులను విదేశీ సంస్థలకు బదిలీ చేసే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి వాటి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఈడీ అధికారులు చెబుతున్నారు. కానీ ఎలాంటి రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతి తీసుకోకుండానే నిధులు విదేశీ సంస్థకు తరలించడంతో ఆ కోణంలో ఈడీ అధికారులుదర్యాప్తు చేయనున్నారు. దీంతోపాటు విదేశాలకు నిధులను మళ్లించినప్పుడు పన్ను మినహాయింపు కూడా తీసుకోవాల్సి ఉన్నా, అది కూడా చేయలేదు. ఈ కారణంగా హెచ్ఎండీఏ అదనంగా 8 కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సి వచ్చింది. మరో పదహారు కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంది. దీనిపై కూడా ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారించే అవకాశముంది.
Next Story