Mon Dec 23 2024 09:57:06 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ లోఐదు కోట్లు స్వాహా.. ఇది వారిపనేనట
తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. తెలుగు అకాడమీ తరహాలోనే ఈ కుంభకోణం జరిగిందని సమాచారం.
తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. తెలుగు అకాడమీ తరహాలోనే ఈ కుంభకోణం జరిగిందని సమాచారం. తెలంగాణ గిడ్డంటుల శాఖలో ఐదు కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. తప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను చూపి సొమ్మును కాజేసినట్లు గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ గిడ్డంగుల శాఖ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అదే తరహాలో....
తెలుగు అకాడమీలో జరిగినట్లుగానే ఇక్కడ జరగడంతో వారి పనే అయిఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు అధికారుల పాత్రపైన కూడా ఆరా తీస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణకు సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. గిడ్డంగుల శాఖ సిబ్బంది పాత్ర పై అనుమానాలు వస్తున్నాయి.
Next Story