Thu Dec 19 2024 17:56:56 GMT+0000 (Coordinated Universal Time)
2.70 కోట్లు సీజ్.. ఫ్లాట్ కొనుగోలు కోసం ఇచ్చి...
హెచ్ఎండీఏ మాజీ శివబాలకృష్ణ వ్యవహారంలో మరో కీలక పరిణామం సంభవించింది
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో మరో కీలక పరిణామం సంభవించింది. ఏసీబీ అధికారులు బినామీ ఆస్తులను వెలికి తీస్తున్నారు. తాజాగా ఆయన ఒక కనస్ట్రక్షన్ కంపెనీలో కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చిన వైనం బయటపడింది. ఒక ఫ్లాట్ కొనుగోలుకు శివబాలకృష్ణ సదరు కంపెనీకి రెండు లక్షల డెబ్బయి వేల కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు.
కన్స్ట్రక్షన్ కంపెనీకి...
శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఫ్లాట్ కొనుగోలు కోసం ఈ మొత్తం శివబాలకృష్ణ చెల్లించినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. దీంతో ఆ నగదును అధికారులు సీజ్ చేశారు. ఇదే కాకుండా ఇంకా ఏ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీల్లో శివబాలకృష్ణ పెట్టుబడులుగా పెట్టారన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరి ఎన్ని కంపెనీల్లో ఈయనగారు పెట్టుబడులు పెట్టారో? ఎన్ని ఫ్లాట్లను కొనుగోలుకు అడ్వాన్స్ లు చెల్లించారన్నది తెలియాల్సి ఉంది.
Next Story