Sun Dec 22 2024 13:15:41 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ప్రత్యేక యాప్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా మరో కీలక అడుగు వేసింది
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా మరో కీలక అడుగు వేసింది. ఈరోజు నుంచి 150 పౌర సేవలను అందుబాటులోకి ప్రభుత్వం తేనుంది. మీ సేవ ద్వారా పౌర సేవలను మరింత చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను సిద్ధం చేసింది. బాగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా కియోస్క్ లను ఏర్పాటు చేయనుంది. మీ సేవ యాప్ ను నేడు ప్రభుత్వం ఆవిష్కరించనుంది.
ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు...
ఇంటింటికి ఇంటర్నెట్ సేవలను కూడా ప్రారంభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను అందించేందుకు టీ ఫైబర్ ప్రాజెక్టును తీసుకు వచ్చింది. దీని ద్వారా ఈ ఏడాది ముప్ఫయి వేల ప్రభుత్వ కార్యాలయాలకు బ్రాడ్ బ్యాండ్ అందించనుంది. దీంతో పాటు పరిశ్రమల శాఖ నాలుగు సంస్థలతో 7,592 కోట్ల రూపాయల అవగాహన ఒప్పందాలను కూడా నేడు కుదుర్చుకోనుంది. ఐటీ పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు సమక్షంలో కీలక ప్రాపెట్కులను నేడు హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు.
Next Story