Wed Apr 16 2025 13:56:36 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ పై ఏసీబీకి మరో ఫిర్యాదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖకు మరో ఫిర్యాదు అందింది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖకు మరో ఫిర్యాదు అందింది. అవుటర్ రింగ్ రోడ్డు అక్రమాణలపై అవినీతి జరిగిందని బీసీ నేత యుగంధర్ గౌడ్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఓఆర్ఆ్ టెండర్లలో 7,380 కోట్ల మేరకు అవినీతి జరిగిందంటూ బీసీ పొలిటికల్ ఐక్య కార్యచరణ సమితి అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో...
ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కేటీఆర్ పై మరో ఫిర్యాదు అందడంతో దీనిని కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి. పెద్దయెత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో దీనిపై కూడా కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలపై విచారణను ప్రారంభించే అవకాశముంది.
Next Story