Wed Dec 04 2024 19:05:14 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో ఏసీబీ తనిఖీలు.. భారీగా నగదు స్వాధీనం?
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చెక్ పోస్టుల్లో తనిఖీలను చేశారు
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చెక్ పోస్టుల్లో తనిఖీలను చేశారు. ఈ సందర్భంగా భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలియవచ్చింది. ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల వద్ద ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి ఈ సోదాలను కొన్ని బృందాలుగా విడిపోయి నిర్వహిస్తున్నాయి.
సరిహద్దు చెక్ పోస్టుల్లో...
అయితే ఈ తనిఖీల్లో చెక్ పోస్టుల్లో ఉండాల్సిన నగదు కంటే ఎక్కువ ఉందని, దానిని మాత్రమే స్వాధీనం చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. అందిన సమాచారం మేరకే ఈ చెక్ పోస్టుల్లో దాడులు ఆకస్మికంగా నిర్వహించినట్లు తెలిసింది. చెక్ పోస్టుల వద్ద పెద్దయెత్తున అవినీతి జరుగుతుందన్న సమాచారంతో ఈ సోదాలను ఏసీబీ అధికారులు నిర్వహించారని చెబుతున్నారు.
Next Story