Mon Dec 15 2025 00:15:36 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy Pawan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారు.

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తెలంగాణలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డికి అందుకు సంబంధించిన చెక్ ను అందజేశారు పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటువంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వానికి అండగా ఉండేందుకే విరాళం ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ ను పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయిలతో పాటు ముంపుకి గురైన సుమారు నాలుగు వందల గ్రామాలకు ఒక లక్ష చెప్పున ఒక్కో పంచాయితీకి అత్యవసర నిధి కింద నాలుగు కోట్లు విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు ఏపీ సీఎం సహాయనిధికి తమ ఒక్క రోజు జీతాన్ని విరాళంగా అందించారు.
Next Story

