Tue Apr 01 2025 02:17:36 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రజలకు చల్లని కబురు.. ఈ ప్రాంతాలకు వర్షసూచన
అదే సమయంలో ఝార్ఖండ్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిమీ ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని ..

అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పులతో అల్లాడిపోతున్న ఏపీ వాసులకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. ఠారెత్తిస్తోన్న ఎండల నుండి ఉపశమనం కలగనుంది. ఉత్తర ఛత్తీస్ గఢ్ నుంచి కేరళ వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని తెలిపింది. అదే సమయంలో ఝార్ఖండ్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిమీ ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది.
ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మరికొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఏపీలో ఏప్రిల్ మాసంలో సాధారణంగా ఉండే ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Next Story