గనుల సర్వేక్షణ సాంకేతికతలో బౌద్ధ అవశేషాల గుర్తింపుకు విజ్ఞప్తి --- బుద్దవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య
హైదరాబాద్, డిసెంబర్, 22 కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణలో గనుల కోసం చేపట్టే సర్వేక్షణంలో, బౌద్ధ స్థావరాల ఉనికిని కనిపెట్టడానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని, కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ కార్యదర్శి, వి. ఎల్. కాంతారావుకు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, డిసెంబర్, 22 కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణలో గనుల కోసం చేపట్టే సర్వేక్షణంలో, బౌద్ధ స్థావరాల ఉనికిని కనిపెట్టడానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని, కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ కార్యదర్శి, వి. ఎల్. కాంతారావుకు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులోని ఎన్.ఎం.డి.సి లో కాంతారావును కలిసి, భారత భూగర్భ సర్వేక్షణ అధికారులకు ఈ దిశగా ఆదేశాలు కోరుతూ ఒక విజ్ఞాపన పత్రాన్ని అందివ్వగా, ఆయన సానుకూలంగా స్పందించారని లక్ష్మయ్య చెప్పారు.
యాదాద్రి -భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం, చాడ గ్రామంలో శాతవాహన-ఇక్ష్వాకుల కాలపు క్రీ. శ. 2-3 శతాబ్దాలు నాటి సున్నపు రాతి బుద్ధుని బొమ్మలు బయల్పడినాయని, అక్కడి పురాతన స్థలం దాదాపు 10 ఎకరాల్లో విస్తరించిందని, ఆ స్థలంలో ఎంత మేరకు పురాతన కట్టడాలు ఉన్నాయో రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే చేపట్టాలని కాంతారావును కోరినట్టుగా మల్లేపల్లి లక్ష్మయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం కన్సల్టెంట్ డా. ఈమని శివనాగిరెడ్డి, డిజైన్ ఇంచార్జ్ ,డి.ఆర్. శ్యాంసుందర రావు పాల్గొన్నారు.