Telangana: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులు వీళ్లే
In Charge Ministers: తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక కార్యక్రమాల్లో చురుకుగా..
In Charge Ministers: తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు జరుపుతున్నారు. ప్రజలకు అన్ని రకాల మేలు జరిగేలా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం తమ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటి అవుతున్నారు. శాఖపరమైన లోపాలను, సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జులను నియమించారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి త్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించారు.
కొత్తగా నియమితులైన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు వీళ్లే..
1. హైదరాబాద్ – పొన్నం ప్రభాకర్.
2. ఖమ్మం – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
3. రంగారెడ్డి – దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.
4. వరంగల్- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.
5. మహబూబ్‌నగర్ – దామోదర రాజనర్సింహ.
6. కరీంనగర్ – ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి.
7. మెదక్ – కొండా సురేఖ.
8. నల్గొండ – తుమ్మల నాగేశ్వరరావు.
9. నిజామాబాద్- జూపల్లి కృష్ణారావు.
10.ఆదిలాబాద్ – సీతక్క.