Mon Dec 15 2025 03:59:23 GMT+0000 (Coordinated Universal Time)
ప్రజాభవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీకి సర్వం సిద్ధం
ప్రజాభవన్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీకి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ప్రజా భవన్ ను పరిశీలించారు. ఈనెల 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా భవన్ లో భేటీ కానున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ కి ప్రజా భవన్ ను వేదికగా ఎంపిక చేసిన నేపద్యంలో పరిశీలించారు.
వేదికకకు కావాల్సిన...
వేదికకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే దగ్గర ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ తదితరు అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశం జరుగుతున్న సమయంలో ప్రజాభవన్ కి చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను పెంచాలని నిర్ణయించారు. ఆ సమయంలో విజిటర్స్ కు నో ఎంట్రీ ఉంటుంది.
Next Story

