గంజాయి అక్రమరవాణాలో తల్లీకొడుకుతో సహా నలుగురు అరెస్టు రూ.4 కోట్లవిలువైన గంజాయి పట్టివేత
తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో పోలీసులు తల్లీకొడుకులతో సహా నలుగురు గంజాయి అక్రమ రవాణా దారులను అరెస్టు చేసి, 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు
గంజాయి అక్రమరవాణాలో తల్లీకొడుకుతో సహా నలుగురు అరెస్టు రూ.4 కోట్లవిలువైన గంజాయి పట్టివేత
తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో పోలీసులు తల్లీకొడుకులతో సహా నలుగురు గంజాయి అక్రమ రవాణా దారులను అరెస్టు చేసి, 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఖచ్చితమైన సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు గౌతం సింగ్ (21), నానాక్ రాం గూడ నుంచి గోల్గొండ వెళుతున్న మరో బాలనేరస్తుడు గౌతంను అరెస్టు చేయగా, వారిచ్చిన సమాచారం మేరకు గౌతం తల్లి నీతుబాయి (45), వారి బంధువు మధుబాయి (60) కారులో ప్రయాణిస్తుండగా పట్టుకున్నారు.
281 సాచెట్ల గంజాయి దొరికిందని ప్రతి ప్యాకెట్ లోను 5 గ్రాములు గంజాయి ఉందన్నారు. రూ. 40 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు, రెండు బైక్ లు వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి 16 అకౌంట్ల నుంచి రూ.1.5 కోట్లు సీజ్ చేశామని, నీతూబాయికి చెందిన రెండుకోట్ల విలువ చేసే లంగర్ హౌజ్ లోని గాంధీనగర్లోని ఇల్లు, గచ్చి బౌలిలోని రాజీవ్ నగర్లో మరో ఇంటిని అటాచ్ చేశామన్నారు. ఇవన్నీ గంజయి అక్రమరవాణా చేయడం ద్వారా సంపాదించినవేనని టీఎస్ ఎన్ఏబీ ఎస్పీ జి.చక్రవర్తి తెలిపారు.