Sun Dec 22 2024 15:00:37 GMT+0000 (Coordinated Universal Time)
కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
కార్తీక సోమవారం కావడతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కార్తీక సోమవారం కావడతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు శైవక్షేత్రాలకు పోతెత్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉన్న శివాలయాలన్నీ భక్త జన సంద్రాన్ని తలపిస్తున్నాయి. కార్తీక మాసం సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడిని పూజస్తున్నారు.
కార్తీక దీపాలు వెలిగించి...
మరోవైపు నదీ జలాల్లో స్నానమాచరించిన భక్తులు కార్తీక దీపాలను వెలిగించిన అనంతరం ఆలయాలకు చేరుకుంటున్నారు. ఈరోజు మూడవ కార్తీక సోమవారం కావడంతో ఉపవాసాలు ఉండి తమ కుటుంబ సభ్యులకు ఆయురోరాగ్యాలు, అష్టశ్వైర్యాలను ప్రసాదించాలని శివుడిని వేడుకుంటున్నారు. తెలంగాణలోని వేములవాడ, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం క్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో దర్శనానికి గంటల సమయం పడుతుంది. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Next Story