Tue Nov 05 2024 12:48:38 GMT+0000 (Coordinated Universal Time)
శివరాత్రికి కిటకిటలాడుతున్న శివాలయాలు
శివరాత్రి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలన్నీ భక్తులతో ఈరోజు కిటకిటలాడుతున్నాయి.
శివరాత్రి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలన్నీ భక్తులతో ఈరోజు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు దర్శించుకునేందుకు ప్రత్యేకంగా క్యూలైన్లలో ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం విశేషం.
ఒకే రోజు రావడంతో...
ఉపవాసాలు ఉండి భక్తులు ఈరోజు శివుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు మహాశివరాత్రితో పాటు శని త్రయోదశి ఒకే రోజు రావడంతో భక్తులు శివాలయాలకు పోటెత్తారు. అమరావతిలోని అమరేశ్వరాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ద్రాక్షారామంలోనూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ముందుగా శనీశ్వరునికి, తర్వాత ఈశ్వరునికి అభిషేకాలు చేస్తే సకల పాపాలు తొలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
Next Story