Sun Dec 22 2024 21:55:18 GMT+0000 (Coordinated Universal Time)
తొలి కార్తీక సోమవారం.. భక్తులతో శైవక్షేత్రాలు కిటకిట
కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్నాయి
కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసానికి ఒక విశిష్టత ఉంది. సోమవారం నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఉండి శైవ క్షేత్రాలను దర్శించుకుంటే శుభమని అందరూ భావిస్తారు. తొలి సోమవారం కావడంతో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని అనేక శివాలయాలు భక్తులతో నిండిపోయాయి. శివాలయాల్లో ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నదుల్లో స్నానమాచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడిని దర్శించుకుంటారు.
ఉపవాస దీక్షలుండి...
భక్తులు ఇబ్బంది పడకుండా శివాలయాల్లో అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కార్తీక మాసంలోని సోమవారం నాడు శివాలయాల్లో ఎక్కువ మంది ఉపవాస దీక్షలు ఉండటం సంప్రదాయంగా వస్తుంది. అందుకే ఈ మాసం ఉపవాస మాసం అని కూడా పిలుచుకుంటారు. మాసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో తమ కుటుంబ సభ్యుల సుఖ సంతోషాల కోసం ప్రజలు శివుడిని ప్రార్ధించడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు శైవ క్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోయాయి.
Next Story