Wed Dec 25 2024 16:16:11 GMT+0000 (Coordinated Universal Time)
ఘనంగా మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభం
మెదక్ కెథడ్రల్ చర్చి లో శతాబ్ది ఉత్సవాలలో భాగంగా, క్రిస్మస్ వేడుకలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఆసియా లోనే రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కెథడ్రల్ చర్చి లో శతాబ్ది ఉత్సవాలలో భాగంగా, క్రిస్మస్ వేడుకలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి..ఆనవాయితీ ప్రకారం ఏసుక్రీస్తు జన్మదినాన్నీ పురస్కరించుకుని తెల్లవారుజామున చర్చి కమిటీ బాధ్యులు శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్టించారు. ఉదయం తెల్లవారు జామున 4.30 గంటలకు ప్రాతఃకల ఆరాధనాతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవాo ప్రారంభం అయ్యింది. ఈ వందేళ్ళ వేడుకలో చర్చి నిర్మాత ఛార్లెస్ వాకర్ పోస్నెట్ మూడో తరం కుటుంబ సభ్యులు లండన్ నుంచి క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్నారు..
ఇతర రాష్ట్రాల నుంచి...
చర్చి ఇన్ ఛార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ వాక్యాన్ని ఇచ్చారు. సుమారుగా ఐదు వేల మంది భక్తులు ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్నారు.క్రిస్మస్ సందర్భంగా ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలియజేసేలా చర్చిలో ప్రధాన వేదిక ముందు సంప్రదాయ పద్దతిలో పశువుల పాక ఏర్పాటుచేసి దానికి స్టార్ ను వేలాడదీశారు. మరో పక్కన పెద్ద సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటుచేసి దానిని బెల్స్, స్టార్స్, గ్రీటింగ్ కార్డ్స్రంగురంగుల బాల్స్తో అందంగా అలంకరించారు .చర్చిలోని విశాలమైన హాలును రంగురంగుల మెరుపు కాగితాలు, బెలూన్లు, స్టార్లతో శోభాయమానంగా అలంకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,కర్నాటక, మహారాష్ట్రల నుంచి భారీ ఎత్తున భక్తులు మెదక్ చర్చికి తరలిరానున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story