Thu Dec 19 2024 18:49:20 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కవిత నివాసానికి చేరుకున్న కేటీఆర్, హరీశ్
కవిత అరెస్ట్ వార్త తెలిసిన వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కవిత నివాసానికి చేరుకున్నారు
కవిత అరెస్ట్ వార్త తెలిసిన వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కవిత నివాసానికి చేరుకున్నారు. వారిద్దరినీ పోలీసులు కవిత నివాసంలోకి పోలీసులు అనుమతించలేదు. కవితను అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారం తెలియడంతో అక్కడకు చేరుకున్న కేటీఆర్, హరీశ్రావులు ఇద్దరూ అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
నివాసం వద్ద ఉద్రిక్తత...
ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కవితను అరెస్ట్ చేశారంటూ అధికారికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటించకపోయినప్పటికీ సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున చేరుకుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులుగా తమను అనుమతించాలని వారు కోరుతున్నా సెక్యూరిటీ సిబ్బంది అంగీకరించడం లేదు. కవిత నివాసం వద్ద భారీగా పోలీసులు మొహరించారు.
Next Story