Tue Apr 22 2025 18:51:00 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్గా రాధాకృష్ణన్
తెలంగాణ గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు

తెలంగాణ గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. తెలంగాణతో పాటు ఆయనకు పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా అప్పగించారు. నిన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజీనామాతో కొత్త గవర్నర్ నియామకం చేపట్టాలంటే ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నిర్ణయం తీసుకున్నారు.
మూడు రాష్ట్రాలకు...
రాధాకృష్ణన్ జార్ఖండ్ తో పాటు తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ బాధ్యతలను నిర్వహించనున్నారు. తాత్కాలికంగానే బాధ్యతలను అప్పగించినట్లు రాష్ట్రపతి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్ 7వ తేదీ వరకూ ఈయనే ఇన్ఛార్జిగా కొనసాగించే అవకాశముంది. అప్పటి వరకూ కొత్త గవర్నర్ నియామకం వీలు కాదు.
Next Story