Mon Dec 23 2024 11:36:45 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ కు బ్రేకప్
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చేరికలు మరింత ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి.
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చేరికలు మరింత ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు అత్యంత సన్నిహితులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే సన్నిహితులు...
వరంగల్ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, కాజీపేట మాజీ కార్పొరేటర్ నుంచు అశోక్ తో పాటు ముస్లిం మైనారిటీ నేతలు అనేక మంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరంతా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.
Next Story