Wed Jan 08 2025 07:40:22 GMT+0000 (Coordinated Universal Time)
మగబిడ్డకు జన్మనిచ్చిన అత్యాచార బాధితురాలు
వెంకటగిరిలో నివాసముంటున్న బాలిక (16) తల్లితో పాటు ఇళ్లల్లో పనిచేస్తుంటుంది. అదే ప్రాంతంలో నివాసముంటున్న..
ఇద్దరు కామాంధుల దాహానికి బలైన అత్యాచార బాధితురాలు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి అత్యాచారం చేయగా.. ప్రేమ పేరుతో లోబరుచుకుని లైంగిక దాడి చేశాడు. ఇటీవలే ఇద్దరు నిందితుల్ని జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఇద్దరి దాష్టీకానికి ఆ బాలిక గర్భం దాల్చి, శనివారం మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు 3 నెలల వయసు దాటిన తర్వాత డీఎన్ఏ పరీక్షలు చేయించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వెంకటగిరిలో నివాసముంటున్న బాలిక (16) తల్లితో పాటు ఇళ్లల్లో పనిచేస్తుంటుంది. అదే ప్రాంతంలో నివాసముంటున్న సాయికుమార్ (25)బాలికతో పరిచయం పెంచుకున్నాడు. అలాగే బాలిక పని చేస్తున్న ఇంటి పక్కన వాచ్మన్గా పని చేస్తున్న నేపాల్కు చెందిన బుద్దిమాన్ కామే(53) అనే మరో వ్యక్తి బాలికతో మాటలు కలిపి గదిలోకి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన ఆహార పదార్థాలు ఇచ్చేవాడు. వాటిని తిన్న తర్వాత మత్తులోకి వెళ్లిన బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్న సాయికుమార్ కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. సుమారు ఆరు నెలల గర్భంతో కనిపించిన బాలికను గుర్తించిన ఆశా వర్కర్లు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచీ బాధిత బాలిక స్టేట్ హోమ్ లో ఉంటూ.. శనివారం నిలోఫర్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టినబిడ్డకు తండ్రి ఎవరన్నది తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.
Next Story