Mon Dec 23 2024 13:41:20 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరు కూలీల ప్రాణం తీసిన సెప్టిక్ ట్యాంక్
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కూలీలు సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కూలీలు సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కూలీలు మృతి చెందారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. గ్రేటర్ పరిధిలో ట్యాంకులను, నాలాలను శుభ్రం చేస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పోయారి. తాజాగా హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఈ ఘటన జరిగింది.
విషవాయువుల....
కొండాపూర్ లోని గౌతమి ఎన్ క్లేవ్ లో సెప్టిక్ ట్యాంక్ ను క్లీన్ చేసేందుకు ఇద్దరు కూలీలు లోపలికి దిగారు. అయితే లోపలికి దిగిన కాసేపటికే ఊపిరాడక ఇద్దరు కూలీలు మృతి చెందారు. విషవాయువుల కారణంగానే చనిపోయారని చెబుతున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story