Mon Dec 23 2024 18:57:25 GMT+0000 (Coordinated Universal Time)
బాధలో బాబు మోహన్.. పోటీ చేయరట
బీజేపీ నేత బాబు మోహన్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని
బీజేపీ నేత బాబు మోహన్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. మొదటి లిస్ట్ లో ఆయన పేరు రాకపోవడంపై బాబు మోహన్ స్పందించారు.ఈ సారి ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదన్నారు బీజేపీ నేత బాబు మోహన్. పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షులకు ఫోన్ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు బాబు మోహన్. పార్టీ తన విషయంలో ఇచ్చే స్పందనను బట్టి పార్టీలో ఉండాలా లేదా అని తేల్చుకుంటానన్నారు. భవిష్యత్ లో తుది నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
సోషల్ మీడియాలో నా కొడుకుకు, నాకు మధ్య టికెట్ కోసం పోటీ నెలకొందని తప్పుడు ప్రచారం జరుగుతోందని.. ఇది సరి కాదన్నారు. ఆందోల్ ప్రజలు నన్ను మూడు సార్లు ఆదరించారని.. ప్రధాని మోదీ మంచి నాయకుడైనా ఇక్కడి నేతల తీరు మాత్రం సరిగ్గా లేదన్నారు బాబు మోహన్. నా కుటుంబంలో చిచ్చు పెట్టె రీతిలో వ్యవహారాలు జరిగాయన్నారు బాబు మోహన్. రెండో లిస్టులో పేరు వున్నా నేను పోటీ చేయనని బాబు మోహన్ స్పష్టం చేశారు.
Next Story