Mon Dec 23 2024 07:25:32 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షాతో సింధూ భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ భేటీ కానున్నారు. 17న షాతో సింధూ సమావేశం కానున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ భేటీ కానున్నారు. ఎల్లుండి అమిత్ షాతో సింధూ సమావేశం కానున్నారు. రేపు రాత్రికి అమిత్ షా హైదరాబాద్ కు చేరుకుంటారు. మర్యాదపూర్వక భేటీ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా వివిధ రంగాల మేధావులు, క్రీడాకారులు, కళాకారులతో భేటీ అవుతూ వస్తున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు. ఈసారి పర్యటనలో పీవీ సింధూను కలవనున్నారు.
విమోచన దినోత్సవ...
అమిత్ షా ఈ నెల17న జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభలోనూ ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభలో కేసీఆర్ సర్కార్ పై మరోసారి అమిత్ షా నిప్పులు చెరిగే అవకాశాలున్నాయి. అమిత్ షా పార్టీ నేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవలే తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా మరోసారి వస్తుండటంతో తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కనున్నాయి.
Next Story