Sun Dec 22 2024 19:23:16 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర అనుమానాస్పద బ్యాగ్ కనిపించడంతో సెక్యూరిటీ హై అలర్ట్ అయింది. రేవంత్రెడ్డి ఇంటికి సమీపంలో ఓ బ్యాగ్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి సమీపంలో ఓ బ్యాగ్ కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఆ బ్యాగ్ ను స్వాధీనం చేసుకుంది. బ్యాగ్ను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారు. అటు వైపు వెళ్లే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
ఈ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారు. అటు వైపు వెళ్లే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
Next Story