Mon Dec 23 2024 01:05:56 GMT+0000 (Coordinated Universal Time)
కవిత అక్క.. బండి అన్న
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య నిజామాబాద్లో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇంటి గృహ ప్రవేశానికి
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్-బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకరికొకరు ఎదురెదురు పడ్డారు. నిజామాబాద్లో బుధవారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకరికొకరు ఎదురెదురు పడ్డారు. మాధవనగర్లోని బీఎల్ఎన్ గార్డెన్స్లో బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీ, బీఆర్ఎస్కు చెందిన ప్రముఖ నేతలు తారసపడి, నవ్వుతూ పలకరించుకోవడంతో అక్కడున్న వారు అంతా షాక్ అవుతూ చూసారు. వీరిద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకోవడం.. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య నిజామాబాద్లో కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇంటి గృహ ప్రవేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కల్వకుంట్ల కవితను ఆహ్వానించారు. అయితే ఒకేసారి ఇద్దరు నేతలు ఆ శుభకార్యానికి హాజరయ్యారు. ఇరువురు నేతలూ పరస్పరం తారసపడగా ఆత్మీయంగా పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పలువురిని ఎమ్మెల్సీ కవిత బండి సంజయ్ కుమార్కు పరిచయం చేశారు. బండి సంజయ్ లక్ష్మీ నర్సయ్య కుటుంబాన్ని పలకరిస్తుండగా, కవిత కూడా అదే సమయంలో నివాసంలోకి వెళ్లారు. ఎదురెదురు పడితే ముఖం తిప్పేసుకోకుండా.. ఒకరినొకరు పలకరించుకున్నారు. BRS నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావును బండి సంజయ్కు కవిత పరిచయం చేశారు. కొద్ది నిమిషాల పాటు మాట్లాడుకుని.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Next Story