Thu Dec 19 2024 17:47:43 GMT+0000 (Coordinated Universal Time)
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను చూసి భయపడుతోంది: బండి సంజయ్
చెరువులో ఉన్న ఒవైసీ అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి వెనుకాడుతున్నారని
హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సరస్సులు, చెరువులు, ఫుల్ ట్యాంక్ లెవల్స్, బఫర్ జోన్ల చుట్టూ ఉన్న అక్రమ ఆక్రమణలను కూల్చివేస్తూ వెళుతోంది. అయితే పలువురు రాజకీయ నేతలు హైడ్రా పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
చెరువులో ఉన్న ఒవైసీ అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి హైడ్రా అధికారులు వెనుకాడుతున్నారని హోం వ్యవహారాల సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం ఒవైసీని చూసి భయపడిందా? అతను చట్టానికి ఎందుకు అతీతుడు? వారు ఇతరుల ఆస్తులను త్వరగా కూల్చివేస్తారు, కానీ ఒవైసీ లేదా ట్విట్టర్ టిల్లు జన్వాడ ఫామ్హౌస్ విషయానికి వస్తే మౌనంగా ఉంటారు. ఈ ద్వంద్వ ప్రమాణానికి స్వస్తి పలకాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని సంజయ్ ట్వీట్ చేశారు.
నాగోల్లో నిర్వహించిన బీజేపీ వర్క్ షాప్ కు హాజరైన ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసే వారిని కాంగ్రెస్, బీఆర్ఎస్ గుర్తించవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, అందరికీ రుణమాఫీ చేయలేదన్నారు. ఒవైసీ విద్యా సంస్థల విషయంలో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల టార్గెట్ తామేనని అందుకే ఆ రెండు పార్టీలు మీరు బీజేపీతో కలిసిపోయారంటే మీరు బీజేపీతో కలిసిపోయారంటూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయన్నారు.

Next Story