Tue Apr 01 2025 02:29:15 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ పై అనుమానం అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఆదిలాబాద్లో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో బీజేపీ నేత బండి సంజయ్

ఆదిలాబాద్లో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కనిపించకపోవడంపై.. తనకు కేటీఆర్ పై అనుమానం కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో వివరాలను వెల్లడించాలని, ఆయనను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కనిపించకపోవడం తనకు చాలా బాధను కలిగిస్తోందని.. ఆయనకు భద్రతను కల్పించాలని కోరారు.
నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్ర్యం అందించిన ఘనడు సర్ధార్ వల్లాభాయ్ పటేల్ అయితే కేసీఆర్ మెడలు వంచి తెలంగాణ ప్రజల బతుకులు మార్చేందుకు అమిత్ షా వచ్చారని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో వచ్చేది మోదీ రాజ్యమేనని, దాన్ని ఎవరూ ఆపలేరని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు గురువు అని కేసీఆర్ ను చూసే తాను మాటలు నేర్చుకున్నానని బండి సంజయ్ అన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు.
Next Story