Sun Dec 22 2024 18:02:03 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం రేవంత్ రెడ్డికి ఆ విషయంలో మద్దతు తెలిపిన బండి సంజయ్
తెలంగాణ పర్యటనకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి వెళ్లారు.
తెలంగాణ పర్యటనకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి వెళ్లారు. ఆయనను సీఎం రేవంత్ రెడ్డి బడే భాయ్ అంటూ సంబోధించారు. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూ ఉండగా.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాత్రం మద్దతుగా మాట్లాడారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే తప్పేమిటని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని.. భవిష్యత్తులోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే పంథాను కొనసాగించాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
పీఎం మోదీని రేవంత్ రెడ్డి కలవటంలో మంచిని చూడాలి కానీ.. ప్రతిదీ రాజకీయం చేయడం సరికాదన్నారు. గతంలో రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తే కేసీఆర్ ఓ దొంగలా దాక్కున్నాడన్నారు. కనీసం రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి కూడా కేసీఆర్ ఆలోచన చేయలేదని దుయ్యబట్టారు.
Next Story