Mon Dec 23 2024 00:38:06 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ ను తప్పించారని ఆత్మహత్యాయత్నం
బీజేపీ ఎంపీ, తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అయితే ఆయన అభిమానులు
బీజేపీ ఎంపీ, తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అయితే ఆయన అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఆయన అభిమాని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఖమ్మం అర్బన్ బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బండి సంజయ్‌ని బాధ్యతల నుంచి తప్పించడాన్ని తట్టుకోలేక పోతున్నా అని ఓ లేఖ రాసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసిన అనంతరం బండి సంజయ్ పార్టీ తనకు కేటాయించిన ఫార్చ్యూనర్ కారును స్టేట్ బీజేపీ ఆఫీసుకు పంపించారు. తన ఛాంబర్ ను కూడా హ్యాండోవర్ చేశారు. గతేడాది 2022లో టయోటా ఫార్చూనర్ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని సంజయ్ కు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ వాహానం కోసం పార్టీ తరుపున రెండుకోట్లు కేటాయించింది. తన అధ్యక్ష పదవి ముగియడంతో బండి సంజయ్ తిరిగి దానిని పార్టీకి అప్పగించారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. మూడున్నర సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు సంజయ్. ఢిల్లీలో నడ్డాతో ముగిసిన భేటీ అనంతరం సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
Next Story