కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషం: బండి సంజయ్
కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి..
కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే చివరకు కాంగ్రెస్ లాభపడిందన్నారు. ఈ సందర్భంతా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రతిసారి తన ఓట్ల శాతం పెరుగుతోందని, తనను ఓడించాలనే లక్ష్యంతో ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకు, వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్ల పక్షానే ముస్లింలు ఓటేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఇకనైనా హిందూ సమాజమంతా ఆలోచించుకోవాలని సూచించారు. ఆదివారం ఫలితాలు వెలువడిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను చైతన్యం చేసేందుకు బీజేపీ పోరాడితే కాంగ్రెస్ లాభపడిందన్నారు. ప్రజలను రాచిరంపాన పెట్టిన కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడామని అన్నారు. నాతోపాటు ఎంతోమంది కార్యకర్తలపై కేసులు పెట్టారు. దాడులు చేశారు. జైలుకు పంపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని సంజయ్ గుర్తు చేశారు. దురద్రుష్టవశాత్తు ప్రజలు మమ్ముల్ని ఆదరించలేదని, అయినప్పటికీ కేసీఆర్ మూర్ఖత్వపు పాలన పీడ విరగడైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కేటీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు మీడియాకు విలువ ఇవ్వలేదన్నారు. అహంకారంతో విర్రవీగిండు.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఎక్కడ లేని గౌరవం ఇస్తుండు.. అంటూ వ్యాఖ్యానించారు.