Sun Dec 22 2024 14:35:06 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్లను టార్గెట్ చేస్తూ.. కిషన్ రెడ్డి ముందే బండి సంజయ్ స్పీచ్
పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తల లక్ష్యాన్ని ఫిర్యాదుల ద్వారా నాశనం చేయకండని.. ఢిల్లీ పెద్దలకు తప్పుడు రిపోర్టులు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ బండి సంజయ్ కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు అన్నలాంటి వ్యక్తి కిషన్ రెడ్డి అని, ఆయన కమిట్మెంట్ అందరికీ తెలిసిందే అని అన్నారు. బీజేపీ కార్యాలయంలోనే ఉంటూ చదువుకొని, ఈ స్థాయికి వచ్చారని అప్పటి నుండి పార్టీ కోసమే పని చేస్తున్నారన్నారు. తాను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనపై కొందరు పార్టీ నేతలు అధిష్టానం పెద్దల వద్ద తప్పుడు ప్రచారం చేశారని అన్నారు బండి సంజయ్. నాపై ఫిర్యాదు చేస్తే చేశారు కానీ.. కార్యకర్తలు ఒక సిద్ధాంతం కోసం ఒక ఆశయం కోసం కష్టపడి పని చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అని చాలామంది నాయకులు నమ్ముతున్నారన్నారు.
పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తల లక్ష్యాన్ని ఫిర్యాదుల ద్వారా నాశనం చేయకండని.. ఢిల్లీ పెద్దలకు తప్పుడు రిపోర్టులు ఇవ్వడం బంద్ చేయాలని అన్నారు బండి సంజయ్. ఢిల్లీకి వెళ్లి తప్పుడు రిపోర్టులు ఇవ్వకండి. కనీసం కిషన్ రెడ్డిని అయినా ప్రశాంతంగా పని చేసుకోనీవ్వండన్నారు. కిషన్ రెడ్డి నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పని చేసే నాయకుడని చెప్పుకొచ్చారు బండి సంజయ్. పార్టీకి నాయకులు ముఖ్యం కాదు.. కార్యకర్తలు, పార్టీ సింబలే ముఖ్యమన్నారు బండి సంజయ్. తాను, ప్రధాన మంత్రి మోదీ పోలింగ్ బూతుల్లోకి వెళ్లి ప్రచారం చేయలేదని.. కార్యకర్తలు, నాయకులే వెళ్లి ప్రచారం చేయడం వల్లే తామంతా గెలిచామని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు కష్టపడడం వల్లే తాము గెలిచామన్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ మూర్ఖత్వపు, వారసత్వ పాలనపై ఉద్యమిస్తామన్నారు.
Next Story