Sun Dec 22 2024 07:51:26 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ అందుకే అమెరికాకు వెళ్లారన్న బండ్ల గణేష్
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత, సినీ నటుడు బండ్ల గణేష్ ఫైర్
Bandla Ganesh Fires On KTR:తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత, సినీ నటుడు బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. తండ్రి పేరు అడ్డు పెట్టుకోనే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని.. కేసీఆర్ అబ్బాయిగా తప్ప కేటీఆర్ కి ఎలాంటి గుర్తింపు లేదన్నారు బండ్ల గణేష్. రేవంత్ రెడ్డి ఒక పోరాట యోధుడు.. చాలా అరుదుగా అలాంటి వాళ్లు ఉంటారనే విషయాన్ని మరచిపోకూడదని బండ్ల గణేష్ అన్నారు. బీఆర్ఎస్ పెట్టిన చిత్ర హింసలు, మానసిక క్షోభ అధిగమించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు బండ్ల గణేష్.
కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుందని.. రేవంత్ సీఏం కావడంతో కేటీఆర్ భాధపడుతున్నారని బండ్ల గణేష్ అన్నారు. కేటీఆర్ రాజకీయ పరంగా డిజాస్టర్ అని విమర్శించారు బండ్ల గణేష్. వందల యూ ట్యూబ్ ఛానెల్స్ పెట్టి రేవంత్ ని తిట్టిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ కాల్ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులు పారిపోతున్నారని తెలిపారు బండ్ల గణేష్. కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే 3 సీట్లు కూడా రాకపోయేవని అన్నారు బండ్ల గణేష్. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ వెళ్ళారని ఆరోపించారు బండ్ల గణేష్.
ఓ ప్రముఖ ఛానెల్ లో సీఎం రేవంత్ పై రోజా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఓ జాక్పాట్ సీఎం అని మంత్రి రోజా కామెంట్స్ చేశారు. రోజా చేసిన వ్యాఖ్యలకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. రోజా డైమండ్ రాణి, ఆక్సిడెంట్ సీఎం ఆమె పని చేస్తున్న పార్టీ నాయకుడని వ్యాఖ్యలు చేశారు. రోజాకు సీటు వస్తుందో.. రాదో అనే పరిస్థితి నెలకొందని అన్నారు బండ్ల గణేష్.
Next Story