Mon Dec 23 2024 09:31:27 GMT+0000 (Coordinated Universal Time)
ఆందోళన విరమణ.. సబిత చర్చలతో
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన విరమించారు. ఏడు రోజులుగా చేస్తున్న ఆందోళనకు వారు ఫుల్ స్టాప్ పెట్టారు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన విరమించారు. ఏడు రోజులుగా చేస్తున్న ఆందోళనను వారు విరమించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆందోళన చేస్తున్న విద్యార్థులతో చర్చలు జరిపారు. బాసర ట్రిపుల్ ఐటీని మంత్రి సబిత సందర్శించారు. స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ విద్యార్థులు మంత్రి సబితతో చర్చలు సఫలమయ్యాయి. ఈరోజు నుంచి తరగతులకు హాజరయ్యేందుకు విద్యార్థులు అంగీకరించారు.
నెల రోజుల్లో.....
మంత్రితో జరిపిన చర్చల్లో సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సబిత హామీ ఇచ్చారు. పదిహేను రోజుల్లో మరోసారి క్యాంపస్ కు వస్తానని, విద్యార్థులతో మాట్లాడతానని సబిత ఇంద్రారెడ్డి చెప్పారు. రెండున్నర గంటలకు పైగా జరిగిన చర్చలు సఫలమయ్యాయని విద్యార్థులు చెప్పారు.
Next Story