Mon Dec 23 2024 06:30:25 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి బతుకమ్మ వేడుకలు
తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి
రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. పెత్రమాస నాడు ఎంగిలి పూల బతుకమ్మగా కొలువుదీరే ఈ పూల పండుగ... సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈసారి బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తీరొక్క పూలతో, వివిధ రకాల రుచులతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో భాగమైన ఈ పండగ కోసం మహిళలంతా ఏడాదంతా వేచి చూస్తుంటారు. తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మ పండగ జరగనుంది.
తొమ్మిది రోజుల నుంచి
పెత్రమాస నుంచి ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి. తొమ్మిదో రోజు ట్యాంక్ బండ్ మీద సద్దుల బతుకమ్మ పండగ పెద్దయెత్తున జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మహాలయ అమావాస్యతో ప్రారంభయ్యే ఈ పండగలో వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆరాధిస్తారు. అందరూ ఒకచోట చేరి పాటలు పాడకుంటూ భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మతో పండగ ప్రారంభమవుతుంది. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నన్ను బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరోరోజు అలిగిన బతుకమ్మ, ఏడోరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెననముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా పండగను జరుపుకుంటారు.
Next Story