Mon Dec 23 2024 06:45:42 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సద్దుల బతుకమ్మ.. ట్యాంక్ బండ్ పై
బతుకమ్మ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. సద్దుల బతుకమ్మతో ముగియనుంది.
బతుకమ్మ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ట్యాంక్ బండ్ పై ఇందుకోసం భారీ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. ట్రాఫిక్ ఆంక్షలను విధించింది. వేల సంఖ్యలో మహిళలు వచ్చి ఈరోజు సద్దుల బతుకమ్మ ఆడుతుండటంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ప్రముఖలందరూ ఈ వేడుకలో పాల్గొననున్నారు.
ఆఖరిరోజున...
ఈరోజు దుర్గాష్టమి. ఈరోజు సద్దుల బతుకమ్మను చేసి ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. అమ్మవారికి ఈరోజు ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తారు. పులగం, పులిహోర, చిత్రాన్నం, నువ్వుల సద్ది, కొబ్బరి సద్ది, పెరుగన్నం ఇలా అనేక రకాల సద్దులను ఈరోజు చేసి పూజలు చేస్తారు. అందరూ కలసి బతుకమ్మ ఆడి వేడుకలకు ముగింపు పలుకుతారు. సద్దుల బతుకమ్మ వేడుకను చూసేందుకు ట్యాంక్ బండ్ పైకి ఈరోజు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశముంది.
Next Story