Sun Apr 06 2025 12:20:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా
బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు బీసీ సంఘాలు నేడు జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాను నిర్వహిస్తున్నారు

బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు బీసీ సంఘాలు నేడు జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాను నిర్వహిస్తున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ ఆందోళనకు దిగనున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.
తీర్మానం చేసిన...
బీసీ కులగణన చేసిన ప్రభుత్వం అనంతరం 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంది. ఈరోజు జరిగే మహా ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు బీసీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
Next Story