డైట్ మెనూ ప్రారంభించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి...!!!
గురుకులాల్లో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు బలమైన ఆహారం అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని
గురుకులాల్లో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు బలమైన ఆహారం అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని,ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని, గురుకుల పాఠశాలలో కామన్ మెనూ డైట్ ని ప్రారంభించిన అనంతరం మీడియాతో చెప్పుకొచ్చారు..!!
ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (బాయ్స్) షేక్ పెట్ లో పర్యటించారు. సంక్షేమ పాఠశాల లో లైబ్రరీ నీ కంప్యూటర్ ల్యాబ్ లో అందుతున్న కోర్స్ లను, డిజిటల్ క్లాస్ రూం సీఓఈ ద్వారా విద్యార్థులకు అందే ప్రత్యేక కోర్సులు తదితర వాటిని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
అనంతరం గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూను మంత్రి ప్రారంభించారు.
కొత్త డైట్ ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. """ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురుకులాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్ లలో బలమైన ఆహారాన్ని అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు , ఎమ్మెల్యేలు ఈరోజు హాస్టల్ లలో సందర్శిస్తున్నారని తెలిపారు."'
గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మంది బలమైన ఆహారం అందించాలని నిపుణులైన డాక్టర్ ల సమక్షంలో డైట్ మెనూ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.