Mon Dec 23 2024 11:02:41 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి భద్రాద్రి రాములోరి బ్రహ్మోత్సవాలు
శ్రీరాముల వారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం 3 లక్షల లడ్డూలను తయారు చేశారు. అలాగే 175 క్వింటాళ్ల తలంబ్రాలను..
భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో వేంచేసియున్న శ్రీ భద్రాద్రి రాములోరి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 16వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా దేవాదాయశాఖ ఈ బ్రహ్మోత్సవాలను నిరాడంబరంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో.. బ్రహ్మోత్సవాలకు భక్తులను అనుమతిస్తుండటంతో.. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
శ్రీరాముల వారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం 3 లక్షల లడ్డూలను తయారు చేశారు. అలాగే 175 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేశారు. వీటిని 60 కౌంటర్ల ద్వారా ఆలయ సిబ్బందిచే భక్తులకు ఉచితంగా అందించనున్నారు. రాములవారి 2.5 లక్షల ముత్యాల తలంబ్రాల పొట్లాలను ఆర్టీసీ కార్గో, తపాలా శాఖ ద్వారా అందించనున్నారు. కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 9న ఎదుర్కోలు ఉత్సవం, 10న నవమి సందర్భంగా కల్యాణం, 11న పట్టాభిషేకం వేడుకలు కన్నులపండువగా నిర్వహించనున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలంకు 350 ప్రత్యేక బస్సులను నడపనుంది టీఎస్ఆర్టీసీ.
Next Story