కేసీఆర్ పై ఈటల ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజకీయ చైతన్యాన్ని చంపేయాలని కేసీఆర్ చూస్తున్నాడని ఈటల అన్నారు. తన మనవడు, మునివడు కూడా ముఖ్యమంత్రి కావాలని చైతన్యాన్ని చంపేస్తున్నారన్నారు. ఇప్పటికే అనేక సంఘాలను కేసీఆర్ చంపేశాడన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడేందుకే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడనిపిస్తోందని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
వాళ్లే బయటకు పంపారు...
తాను పార్టీ నుంచి బయటకు రాలేదని, వాళ్లే పంపారని ఈటల చెప్పారు. ఇజ్జత్ ఉన్నవాడిగా రాజీనామా చేశానని చెప్పారు. హుజూరాబాద్ లో 600 కోట్లు కేసీఆర్ ఖర్చు చేసినా ప్రజలు మాత్రం తననే గెలిపించారని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలకు ఉన్న సోయి రాజకీయనాయకులకు లేదని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. 2018లో కూడా తనను డబ్బులిచ్చి ఓడించాలని చూశారని ఈటల తెలిపారు. కేసీఆర్ రైతు వ్యతిరేకి అని ఈటల అన్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రానికి అరిష్టమని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.