Fri Dec 20 2024 07:48:53 GMT+0000 (Coordinated Universal Time)
యాదాద్రిలో బండి ప్రమాణం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేశారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేశారు. బీజేపీ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించలేదని ఆయన ప్రమాణం చేశారు. తడిబట్టలతో ఆయన ఈ ప్రమాణం చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను తమకు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మూడు రోజుల నుంచి దాచి పెట్టారని దానిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వాళ్లంతా గాలిగొట్టంగాళ్లే...
ఫాం హౌస్ కు వచ్చిన వాళ్లంతా గాలి గొట్టంగాళ్లని ఆయన అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఒక్కొక్క కుటుంబానికి తులం బంగారం ఇచ్చినా టీఆర్ఎస్ గెలవదని తేలిపోయిందని, అది తెలిసిన కేసీఆర్ ఈ డ్రామాలకు తెరతీశారన్నారు. వందల కోట్లు అని ఆరోపణలు చేసిన వారు ఒక్క రూపాయి కూడా సీజ్ చేయలేదని, ఇక్కడే వారి డ్రామా బయటపడిందని బండి సంజయ్ అన్నారు. ప్రజలు ఎవరూ టీఆర్ఎస్ ఆరోపణలను నమ్మరని, అదంతా ఫేక్ అని తేలిపోయిందని బండి సంజయ్ అన్నారు.
Next Story