Mon Dec 23 2024 00:52:43 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్ట్
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిసేందుకు బొమ్మలరామరం పీఎస్ కు వచ్చిన రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ అరెస్ట్ కు కారణం అడిగిన ఎమ్మెల్యే రఘునందన్ రావు తో లా ఆండ్ ఆర్డర్ సమస్య అని చెబుతూ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
హౌస్ మోషన్ పిటీషన్...
కాగా బండి సంజయ్‌ది అక్రమ అరెస్ట్ అంటూ బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. కనీసం నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేశారని ఆరోపించారు. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ లీగల్ సెల్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ శ్రేణులు పెద్దయెత్తున ఆందోళనకు దిగాయి. బండి సంజయ్ ను వదిలి పెట్టాలంటూ నినాదాలు చేస్తున్నారు.
Next Story