Wed Apr 16 2025 02:14:14 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలి
బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.

బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. అసలు ఆ షోలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. యాంకర్ రవిని బయటకు పంపడంలో ఏం జరిగిందనేది తెలియాలన్నారు. హైదరాబాద్ లో ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి సమస్యను బిగ్ బాస్ నిర్వాహకులు సృష్టిస్తున్నారని రాజా సింగ్ మండి పడ్డారు. ఆ షోను తెలంగాణలో బ్యాన్ చేయాలని ఆయన కోరారు.
ప్రాంతీయవాదాలు తెచ్చి....
రియాల్టీ గేమ్ షో లో కంటెస్టెంట్లు శృతి మించుతున్నారని రాజాసింగ్ ఆందోళన చెందారు. నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియో వద్ద రవి అభిమానులు గొడవ చేశారని, ఈ గొడవలకు కారణం బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రమేనని చెకప్పారు. హిందూ దేవుళ్లను సయితం బిగ్ బాస్ షోలో అవమానపరుస్తున్నారని రాజా సింగ్ అన్నారు. దీనిపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
Next Story